Rain Child (Telugu) A Child of the Rain (American Story) by Elia W. Peattie (best books to read in your 20s .TXT) 📕
- Author: Elia W. Peattie
Book online «Rain Child (Telugu) A Child of the Rain (American Story) by Elia W. Peattie (best books to read in your 20s .TXT) 📕». Author Elia W. Peattie
A Child of the Rain
(American Story
by Elia W. Peattie
రెయిన్ చైల్డ్
(అమెరికన్ కథ)
ఎలియా డబ్ల్యు పీటైట్
అనువాదం: బిఆర్ రాక్సన్
ఆ రాత్రే లేడీ టైలర్ మోనా మీక్స్ తనని ప్రేమించటం లేదని దర్జీ చెప్పాడు. అతడు వెంటనే నమ్మలేకపోయాడు, ఆమె తనని ప్రేమిస్తున్నదని చాలాకాలం నుంచి తను అనుకుంటున్నాడు. వాతావరణం ఎంత భయంకరంగా ఉన్నా, ప్రయాణీకుల రష్ ఎంత ఎక్కువగా ఉన్నా, టిక్కెట్లు ఇస్తూ, ప్రయాణీకులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బెల్ పంచ్ చేస్తూ ఉన్నా, అతని మనసు మాత్రం ఆమె గురించి మధుర గీతం పాడుతూనే ఉండేది.
ఇప్పుడు ఏ కారణం లేకుండానే, కేవలం స్త్రీ మనసు కారణంగా, ఆమె మనసు మార్చుకుంది. ఆమెని చూడాలని సాయంత్రం అయిదు గంటలకి వచ్చాడు. నైట్ షిప్ట్ కి ముందు ఉన్న కొద్దిపాటి సమయంలో. ఆమె కోసం తాను పొదుపు చేసిన డబ్బుల్లోంచి రెండు ఎర్రని ఆపిల్స్ కొని తీసుకువచ్చాడు. ఆమె ఆ ఆపిల్స్ ని కనిపించనివిగా, అంటే అవి కనిపించటం లేదన్నట్లుగా చూసింది. కత్తిరించి పడేసిన చిన్న చిన్న వేస్ట్ క్లాత్ ముక్కల మధ్య ఆమె చిందరవందరగా ఉన్న తన చిన్న డ్రెస్ మేకింగ్ పార్లర్ లో నిలబడి ఉంది. ఆమె ఇలా అంది:
"ఏమీ లాభం లేదు జాన్. జీవితాంతం నేను ఇలాగే ఇక్కడ పనిచేయాలి అని రాసిపెట్టి ఉంది... వంటరిగా. నేను నిన్ను ప్రేమించటం లేదు జాన్. ప్రేమించటం లేదు. ప్రేమిస్తున్నాననుకుని నేను పొరపడ్డాను. "
"నిజంగానా?" అని జాన్ అడిగాడు, ఆ మాటల్ని అతి కష్టం మీద పలుకుతూ.
"అవును," ఆమె అంది, నిలువెల్లా వణుకుతూ, క్షమించని ప్రార్థిస్తున్నట్లుగా చేతులెత్తి.
అప్పుడు... ఒక పెద్ద ఫూల్ లాగ అతడు ఆత్మగ్లానితో గిర్రున వెనుదిరిగి, చకచకా మెట్లు దిగి, జోరున కురుస్తూ జనాన్ని ఎడాపెడా బాదేస్తున్న వర్షంలో ఓ మూల నిలబడి, తన కారు కోసం ఎదురు చూడ సాగాడు. కాస్సేపటి తర్వాత తడిసిన రోడ్డు మీద నీలి నిప్పులు చెరుగుతూ అది వచ్చింది. జాన్సన్ కి చిన్నగా పేలవంగా గుడ్ నైట్ చెప్పి, జాన్ అతనిని రిలీవ్ చేసి, తన షిఫ్ట్ ని తీసుకున్నాడు.
వర్షం జల్లు ముఖం మీద గట్టిగా బాది తనలో చలి పుట్టించినందుకు అతనికి ఆనందంగానే ఉంది. చలిగాలి క్రూరత్వానికి అతడు చాలా ఆనందించాడు. అది ఎక్కే జనాన్ని గట్టిగా బాదుతూ, వాళ్ల బట్టలని మడతలు పెట్టి విరగదీస్తూ, వాళ్లని సరిగ్గా నిలబడనీయకుండా చేస్తూ, వాళ్ల సంతులాన్ని చెడగొడుతూ నానా హైరానాకి గురి చేసే ఆ వాన శక్తిని గుర్తించి, అతడు ఆనందం అనుభవించాడు. తన ఎముకల్లో కొరికేస్తున్న చలికి, తనని బాధిస్తున్న ఆకలికి అతడికి ఆనందంగా ఉంది. తను ఇప్పుడే భోంచేసానని జ్ఞాపకం పెట్టుకున్న సమయం నుంచి ఎంత సేపయిందో తెలియదు. గందరగోళంగానే సమయం గడుస్తూ ఉంది. అతనికి టైమ్ గురించి స్పృహ నశించింది. చాలా లేట్ అయింది... అర్థ రాత్రి అవుతూ ఉంది... ఈ చీకటి తుఫానులో అక్కడక్కడ జనం చెదురు మదురుగా ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. దాన్నిబట్టే సమయం ఎంతయిందో తెలుసుకోవచ్చు. కారులో చివరగా కూర్చుని ఉన్న ఒక చిన్నవాడి ఆకారాన్ని అతడు గమనించాడు. ఆమె లోపలికి ఎక్కుతూ ఉన్నప్పుడు అతడు ఆ పిల్లవాడిని చూడలేదు. ఆ సాయంత్రం నుంచి అన్నీ చాలా క్రూరంగా, అనూహ్యంగా జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఊహాతీతంగా ఉన్నాయి... తనకి తానే చాలా క్రూరంగా, అనూహ్యంగా కనిపిస్తూ ఉన్నాడు... కాబట్టి ఆ చిన్న ప్రాణిని తాను గమనించకపోవటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
ఆమె చాలా పెద్ద కోటులో మునిగిపోయి ఉంది. కాబట్టి పేవ్ మెంట్ మీద ఈడ్చటం చేత దాని క్రింద అంచులు అరిగిపోయి, దారాలు వేలాడుతూ ఉన్నాయి. ఆమె శిరోజాలు దువ్వెన ముఖం చూడక, చెలరేగినట్లు ఆమె భుజాల మీద పడుతూ ఉన్నాయి. ఆమె వేసుకున్న రబ్బరు షూస్ చాలా పెద్ద సైజ్ వి, అవి సోల్స్ క్రిందకి వేలాడుతూ, ఆతి కష్టం మీద ఆమె పాదాలకు రక్షణను అందిస్తున్నాయి.
ఆ చిన్నవాడి పక్కన కొయ్యపలక పెట్టిలో కొన్ని గేళ్లాలు ఉన్నాయి, దాన్ని పట్టుకుని భుజంపై తీసుకు వెళ్లటానికి వీలుగా దానికి మందమైన స్ట్రాప్ కట్టబడి ఉంది. ఆ పిల్లవాడి తల నీరసంగా వాడి కడుపు మీదకి వేలాడుతూ, చేతులు ముడుచుకుని ఒడిలో పెట్టుకుని ఉన్నాడు. వాడు ఆకలితో, అలసటతో ఉన్నాడని అర్థం అవుతున్నది. జాన్ బిల్లింగ్స్ కి ఆ పిల్లాడి మీద జాలి కలిగింది. ఆకలితో, ఒంటరితనంతో, చాలా అలసటతో కనిపిస్తున్న ఆ పిల్లవాడి దగ్గర తను టాక్సీ ఫేర్ తీసుకోగూడదని అనుకున్నాడు.
"బ్రేక్ ఫాస్ట్ కి తనకి ఒక నికిల్ (డాలర్ లో 20 వ వంతు కాపర్ నాణెం) కావాలి," అని అతడు మనసులోనే అనుకున్నాడు, "కంపెనీ ఏదో ఒకసారికి ఐతే ఇది భరించగలదు. లేకపోతే, నా దురదృష్టాన్ని నేనే సెలబ్రేట్ చేసుకుంటాను. సోదర ప్రేమ ఓటమికి నేను సిద్ధమే!" ట్రాన్స్ ఫర్ ని రికార్డ్ చేయటానికి పంచ్ బెల్ ని రింగ్ చేస్తూ, తన పెద్ద కోటులోని ఒక జేబులోంచి ఒక నికిల్ ని తీసి, దాన్ని మరొక జేబులో వేసుకున్నాడు.
చీకటిలో కారు ముందుకి దూసుకుపోతున్నది, వర్షం ఎప్పటికంటె తీవ్రంగా అతని ముఖం మీద తాకుతూ ఉంది. తుఫాను తాకిడి చప్పుడు రాత్రి నిండా భయంకరంగా నిండి ఉంది. వాతావరణం మార్పు కారణంగా కారు అద్దాలు చెమ్మకి మూసుకుపోయి ఉండటంతో, ఆ యువ కండక్టర్ వెనక సీటులో ఓ మూల కూర్చున్న ఆ పిల్లవాడిని చూడలేక పోయాడు. ఆ పిల్లవాడి గురించి అతనిలో ఆత్రుత మాత్రం చోటు చేసుకుంది.
"అంతా సవ్యంగానే ఉందని నేను ఎలా అనుకోవాలి," అని అతడు తనలో తానే అనుకున్నాడు. "ఇలా ఇంత నిశ్శబ్దంగా కూర్చున్న ఏ పిల్లవాడినీ నేను ఇంత వరకు చూడలేదు." అని కూడా అనుకున్నాడు.
ఆ పిల్లవాడితో మాట్లాడాలని అతడు కారు డోర్ తెరిచాడు. కాని అప్పుడే లైట్స్ విషయంలో ఏదో ఇబ్బంది వచ్చింది. బ్లూ మరియు గ్రీన్ ఫ్లికరింగ్. ఆ తర్వాత చీకటి, కారు సడన్ గా ఆగింది. గాలి, వర్షం తాకిడి ఎక్కువై కారు డోర్ ని తాకింది. తరువాత ఒక క్షణానికి లైట్స్ మళ్లీ వచ్చాయి. జాన్ బిల్లింగ్స్ తలుపు మూసివేసేసాడు. ఆ చిన్నారి పాసెంజర్ ని చూడటానికి అతడు ప్రయత్నించాడు. కాని కారులో ఎవరూ లేరు.
ఇది నిజం. అక్కడ ఏ పిల్లవాడు లేడు --- ఆమె కూర్చున్న చోటులో ఆమె ఉనికిని తెలిపేలా చిన్నతడి కూడా అక్కడ కనిపించ లేదు.
"బిల్," ఫ్రంట్ డోర్ దగ్గరకి వెళ్లి, డ్రైవర్ ని పిలిచి అన్నాడు, "చిరిగిన పాత చొక్కాలో కూర్చున్న ఆ పిల్లవాడు ఏమయ్యాడు?"
"ఏ పిల్లవాడినీ నేను చూడలేదు," అన్నాడు బిల్ చిరాకుగా. " జాన్, దయచేసి ఆ డోర్ మూసెయ్, అటు నుంచి వచ్చే వర్షం వొలుపురుతో నా వీపు తడిచిపోతూ ఉంది."
"వొలుపురా!" జాన్ అతన్ని ఎదిరిస్తున్నట్లుగా అన్నాడు, "వొలుపురు ఎక్కడ?"
"నువ్వు వెనక తలుపు తెరిచి వదిలేసావు," బిల్ అరుస్తున్న ధోరణిలో అన్నాడు. పిడుగు నెత్తి మీద పడ్డట్లు బేర్ స్కిన్ కోట్ లో వున్న బిల్ నిలువెల్లా వణికిపోతూ జాన్ కి కనిపించాడు. కాని డోర్ తెరిచి లేదు. కారులో చల్లని చలిగాలి మాత్రం నిండి, అంతా ఐసు తాకిడిలా వున్నసంగతి జాన్ గుర్తించాడు.
అయినా పర్వాలేదు. ఏమీ పర్వాలేదు. సీట్ క్రిందకి చూసి, ఆ చిన్నవాడు అక్కడకి దొర్లిపోయి నిరాశ్రయంగా పడి ఉండలేదని జాన్ నిర్ధారణ చేసుకున్నాడు. ఎక్కడా ఏమీ లేదు అని జాన్ మనసులోనే అనుకున్నాడు. ఏమీ లేదని నిర్ధారణ చేసుకోవటంలో తను ఎక్స్ పర్ట్ అయినట్లు జాన్ కి అనిపించింది.
ఆ పిల్లవాడు కారులోనే ఉండి ఉండాల్సింది. ఆ రోజు ప్యాసెంజర్ల రద్దీ కూడా లేదు. కాని బహుశా వర్షంలో తడవాలన్న కోరికతో ఆ అబ్బాయి బయటికి దిగిపోయి ఉండాలి. గాలి అతన్ని బాది బాది క్రిదకి తోసేసి కూడా ఉండవచ్చు. ఆ అబ్బాయి గాని సిటీకి దూరంగా, ఏ ప్రశాంత స్థానంలోనో వుండి ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు జాన్. మనిషి నేల మీద పడుకుని ప్రశాంతంగా సాగర సంగీతం లేదా తుఫాను ఘోషవి వింటూ ఉండవచ్చు. లేదా సడన్ గా ముసలివాడైపోయి, ఈ ఇబ్బందులన్నింటినీ దాటెయ్యవచ్చు--- లేదా---
ఒక మలుపు దగ్గర తిరుగుతూ ఉన్నకారు అకస్మాత్తుగా ఒక కుదుపుతో ఆగిపోయింది. కండక్టర్ బిల్లింగ్ ప్లాట్ ఫాం మీద నిలబడి ఉన్నాడా లేక నిప్పులు కక్కుతున్న చక్రాల క్రిందకి పోయాడా అన్న సందేహం ఒక్క క్షణం కలగటం సహజం. అకస్మాత్తుగా బ్రేక్ మీద శ్రద్ధ పెట్టి, కారుని ఆపి, డ్రైవర్ కాస్సేపు అయోమయంలో పడ్డాడు.
"నేను నిద్రమత్తులో జోగి ఉంటాను," అతడు తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు..
అప్పుడే అస్పష్టంగా, మసకబారిన కిటికీలోంచి ఆ చిన్నవాడి ఆకారాన్ని చూసాడు, తలని గుండెలమీదకి వాల్చి, తన చిన్నారి చేతులని వొడిలో ఆన్చుకుని ఆ పిల్లవాడు కనిపించాడు. ఆసక్తి కలిగించే ఆ పెట్టె వాడి ప్రక్కనే ఉంది. జాన్ బిల్లింగ్ శరీరంలో చలిగాలి చెలరేగింది. ఈ చలి మామూలు వాతావరణం మార్పులోని చలి కంటె విపరీతంగా, చాలా ఎక్కువగా ఉంది. అరవాలనుకున్నా అరవలేక తలుపు వెనక్కి తోసాడు. స్ప్రింగ్ లా ఎగిరి, ఆ పిల్లాడు కూర్చున్న ఆ మూల సీటు దగ్గరకి ఒక్క ఉరకన చేరాడు.
సీట్ మీద గ్రీన్ కార్పెట్ పొడిగా, వెచ్చగా ఉంది. తడి లేదు. ఆ పిల్లాడు అక్కడ కూర్చున్నట్లే లేదు.
అతడు ఫ్రంట్ డోర్ వద్దకి పరిగెత్తుకు వెళ్లాడు.
."బిల్," గర్జిస్తున్నట్లుగా అడిగాడు, "ఆ పిల్లాడు ఏమయ్యాడు?"
"ఏ పిల్లాడు?"
"ఆ పిల్లాడే! పాతకోటులో తడిచి వచ్చిన ఆమె. ఇనుప గొళ్లాల పెట్టెతో వచ్చిన ఆ పిల్లాడు! మన కారులో వెనక సీటులో కూర్చున్న ఆ పిల్లవాడు!"
బిల్ చిరాకుగా యంగ్ కండక్టర్ ముఖంలోకి చూస్తూ అన్నాడు..
"నువ్వు తాగి ఉన్నావా? ఫూల్!" అన్నాడు బెదిరిస్తూ. "ముందుగ నీ గురించి రిపోర్ట్ చేయవలసి వస్తుంది!"
యంగ్ కండక్టర్ ఒక్క మాట కూడా అనలేదు. నెమ్మదిగా, నీరసంగా వెనక్కి తన చోటికి వెళ్లిపోయాడు. కారు అంచుకి జేరబడి అలా మౌనంగా కూర్చుండి పోయాడు. ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మాట్లాడాడు
"దురదృష్టం ప్రతి చోటా!" అతని నోటి నుంచి వినిపించింది, "నువ్వు కూడా నన్ను ప్రేమించ లేదు!"
అతడు ఇంటికి ఎలా చేరుకున్నాడో అతనికే తెలియదు. చనిపోతున్నవాడు చావులోకి మునిగిపోతున్నట్లు అతడు నీరసంగా నిద్రలోకి మునిగిపోయాడు. సహృదయుడైన ఆ యువకుడికి మళ్లీ మర్నాడు రాత్రి డ్యూటీ పడింది. ఆ రోజు కూడా ఎడతెరిపి లేని వర్షం జోరున కురుస్తున్నది. ఎముకల్ని కొరికి తినేస్తున్న చలి గాలి.
అది చివరి రన్. కారు లిమిట్ లోని వేగంలోనే వెళ్తున్నది. అకస్మాత్తుగా చిన్న కుదుపుతో కారు ఆగింది. అదేమిటో జాన్ బిల్లింగ్ కి తెలుసు. ఇలాంటిది అతడు అంతకు ముందు ఒకసారి చూసాడు. ఒక్క క్షణం అతడి కడుపు దేవేసినట్లు అనిపించింది. ధైర్యం కూడగట్టుకుని, కారులోంచి బయటకి దూకి, కారు ప్రక్కకి వెళ్లాడు. డ్రైవర్ బిల్ కనిపించాడు. అతని చేతుల్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని గ్యాస్ లైట్ దగ్గరకి తీసుకు వచ్చాడు. జాన్ ఆ పిల్లవాడిని చూసి, తెలియకుండానే చిన్నగా అరిచాడు.
"ఈ పిల్లవాడే, బిల్! నిన్న నేను అడిగినది ఈ పిలవాడే!"
నిజంలాంటి పచ్చి నిజం. చిరిగిపోయి నేలకి జీరాడే పాత కోటులో ఆమె, నీలిరంగు చేతులు, పలుచని భుజాలు, ఎండుగడ్డిలా కనిపిస్తున్న తల వెంట్రుకలు, కాళ్లకి లూజుగా సోల్ ఊడిపోయి ఉన్న వర్షం బూట్లు. ఆమె శరీరం రోడ్డు మీద పడి ఉంది. ఆ పక్కనే చిందరవందరగా పడివున్నఇనుప గొళ్లేల చెక్క పెట్టె.
"ఆమె కారు క్రింద పడింది, కావాలనే పడింది!" బిల్ అరుస్తూ అన్నాడు. "ఆమెని ఆగమని నేను గట్టిగా అరుస్తున్నాను, కాని ఆమె నన్ను చూసి కూడా, తిన్నగా కారుకి ఎదురుగా వచ్చింది!"
చలిగాలి తాకిడికి తెల్లబడిన ఆ ముఖం మరింత తెల్లబారింది. ఆ ముఖంతోనే జాన్ ని చూస్తున్నాడు.
"నిన్న నువ్వు త్రాగి ఉన్నావా అని అడిగాను, కాని అది నిజం కాదని నాకు తెలుసు జాన్," అన్నాడు.
"అయితే నువ్వు కూడా – నిజంగా ఈ పిల్లవాడిని చూసావా -- అక్కడ?" జాన్ అడిగాడు.
"అంత గట్టిగా మాత్రం చెప్పలేను!" అన్నాడు బిల్.
కాస్సేపటికి పెట్రోల్ వేగన్ వచ్చి ఆమెని, ఆ హేస్ప్స్ బాక్స్ ని తీసుకుని వెళ్లిపోయింది.
[The End}
Imprint
Text: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: Sunkara Bhaskara Rao
Publication Date: 09-16-2015
All Rights Reserved
Comments (0)